Karthika Deepam 2: ఆమె పెళ్ళిచూపులకి నగలిచ్చిన శివన్నారాయణ.. దీప ఉండకూడదని జ్యోత్స్న ఫిక్స్!
on Mar 16, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-306లో.. జ్యోత్స్న మారిందని దీప నిజంగానే నమ్ముతుంది. నువ్వు అన్నట్లు నిజంగానే జ్యోత్స్న మారితే మంచిదే. కానీ పెళ్లి కూడా ఒక ప్లాన్ అయితే అప్పుడేం చేస్తాం.. ఏమో దీపా.. నాకైతే నమ్మకంలేదని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. అయితే దీప మాత్రం.. లేదు బాబు మీరు నమ్మి తీరాలి. జ్యోత్స్నలో మార్పు మొదలైంది. తను నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని మనసులో అనుకుంటుంది.
మరోవైపు శ్రీధర్ ముందు కావేరీ కూర్చుని అతడి తలపై చేయి పెట్టి.. మీరు ఇక మూడో పెళ్లి చేసుకోవాల్సిందే.. నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను.. నా ఆస్తి మొత్తం మీకే రాసేసి.. నేను అక్క దగ్గరకు వెళ్లిపోతాను.. మీరు మాత్రం మూడో భార్యతో సంతోషంగా ఉండండి చాలు అని అంటుంది. నాకు మూడో పెళ్లేంటి కావేరీ.. వద్దు అని శ్రీధర్ అంటాడు. మీరు కాదు, వద్దు అంటే నేను చచ్చిపోతానని కావేరి అంటుంది. ఇక కావేరీ అలా అనేసరికి.. సరే కావేరీ నీ ఇష్టమే నా ఇష్టం.. నువ్వు ఎలా అంటే అలానే చెయ్ అంటూ మూడో పెళ్లికి శ్రీధర్ ఓకే అంటాడు. వెంటనే అతడికి ఓ డౌట్ వస్తుంది. మరి నా మూడో పెళ్లికి మొదటి భార్యను పిలుస్తావా? అదే కాంచనను పిలుస్తావా అని శ్రీధర్ అనగానే.. దానికి కావేరీ సమాధానం చెప్పదు. దాంతో శ్రీధర్ నిద్రపోతూ కల కంటున్న సీన్ చూపిస్తారు. కావేరీ కావేరీ.. చెప్పు.. నా మూడో పెళ్లికి మొదటి భార్యను పిలుస్తావా అని కావేరీని పిల్చుకుంటూ తడుముకుంటూ లటుక్కున కిందపడతాడు. వెంటనే ఓహో ఇదంతా కలనా అని శ్రీధర్ అనుకుంటాడు.
ఇక శ్రీధర్ లేచి నిలబడి చుట్టూ చూసేసరికి పక్క గదిలో కావేరీ.. స్వప్నతో ఫోన్ మాట్లాడుతుంటుంది. మీ మావయ్యగారికి ఎలా ఉంది స్వప్న అని కావేరీ అడగ్గా.. బాగానే ఉంది మమ్మీ.. త్వరలోనే కోలుకుంటారు.. అది సరే కానీ మమ్మీ, ఇంతకీ నీకో విషయం చెప్పలేదు.. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని స్వప్న అంటుంది. అవునా ఇది నిజంగానే శుభవార్తే.. పోనీలే ఇక కార్తీక్ కష్టాలు పోయినట్లే అవుతాయని కావేరి అంటుంది. అదంతా శ్రీధర్ వినేసి.. ఏంటా శుభవార్తా? ఏంటా కార్తీక్ జరిగే మంచి అని తలపట్టుకుంటాడు. ఈ విషయం డాడీకి చెప్పు మమ్మీ అని స్వప్న అంటుంది. మీ డాడీ రెండు పెగ్గులేసి పడుకున్నారులే.. అయినా ఇలాంటి శుభవార్తలు మీ డాడీకి చెప్పకూడదని కావేరి అంటుంది. ఇక కావేరి ఫోన్ పెట్టేసి వంట చేసుకుంటుంది. ఇక శ్రీధర్ తెగ రగిలిపోతాడు. శుభవార్త.. కార్తీక్ కష్టాలు తీరతాయంటే.. బహుశా నా శివ మామ.. కార్తీక్ వాళ్లకి ఆస్తి రాసి ఉంటాడు.. అది నాకు చెబితే నేను వెంటనే బాకీ తీర్చమంటాను కాబట్టి నాకు చెప్పాలని వీళ్లు అనుకోలేదు.. అయినా కార్తీక్ గాడికి సలహా ఇచ్చిందే నేను.. నాకు థాంక్స్ చెప్పాలిగా వాడు.. చెప్పే దాకా ఎదురు చూస్తా.. చెప్పకపోతే వదిలిపెడతానా అని శ్రీధర్ అనుకుంటాడు.
తన మొదటి భార్య నగలన్నీ జ్యోత్స్న రెడీ అయ్యే దగ్గరకు తెప్పిస్తాడు శివన్నారాయణ. అమ్మా సుమిత్రా.. ఇవన్నీ మీ అత్తయ్యగారి నగలమ్మా.. బతికి ఉంటే మీ అత్తయ్యే జ్యోత్స్నకు స్వయంగా అలంకరించేది.. వీటిని పెట్టమ్మా తనకి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇలాంటప్పుడే తీసుకోవాలి సుమిత్రా.. ఇవన్నీ నీ కూతురికే అని పారిజాతం అంటుంది. సుమిత్రా.. పెళ్లి వాళ్లు రావడానికి టైమ్ ఉంది కదా.. ఈలోపు వీటిని అలంకరించమ్మా అని శివన్నారాయణ అంటాడు. థాంక్స్ తాతా అని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ ఈ ఇంటి వారసురాలికి చెందాల్సినవే అమ్మా అని శివన్నారాయణ అంటాడు. అంటే దీపవి అన్న మాట అని జ్యోత్స్న అనుకుంటుంది. నీకు ఏవి కావాలంటే అవి పెట్టుకో.. ఇవన్నీ నీకే అనేసి పారిజాతాన్ని తీసుకుని శివన్నారాయణ వెళ్లిపోతాడు. అవును.. అన్నీ నాతోనే ఉండాలంటే దీప ఉండకూడదు. దీపని బతకనివ్వకూడదని జ్యోత్స్న ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
